వరంగల్,(విజయక్రాంతి): వరంగల్ జిల్లాలోని భద్రకాళి అమ్మవారిని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పొంగులేటిని అర్చకులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అర్చకులు, ఈవో పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
ఆలయ మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తామని, భద్రకాళి జలాశయాన్ని తాగునీటి జలాశయంగా మారుస్తామని హామీ ఇచ్చారు. భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చెరువును సర్వే చేయించి నిర్మాణాలను తొలగిస్తామని మంత్రి చెప్పారు. వరంగల్ ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు. కేంద్రం అనుమతిస్తే మామునూరు విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.