భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని శనివారం నాడు రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకుని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాదు నుండి నేరుగా భద్రాచలం చేరుకున్న మంత్రి సంప్రదాయ దుస్తులతో ఆలయ వద్దకు చేరుకోగా వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన దేవాలయంలో మూలవర్లను దర్శించుకోగా ఆలయ అధికారులు లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయం ఆవరణలో వేద ఆశీర్వచనం నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేశారు. మంత్రి వెంట భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు