18-04-2025 02:15:24 PM
గద్వాల,(విజయక్రాంతి): ఈ నెల 19 న థరూర్ మండల(Dharur mandal) కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం( Bhu Bharati Act)-2025 అవగాహన సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy ) జోగులాంబ గద్వాల జిల్లాకు విచ్చేయుచున్నట్లు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8:05 గంటలకు బేగంపేట, హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి 8:50 గంటలకు గద్వాల ఐడిఓసి పి జె పి క్యాంపు వద్దగల హెలిప్యాడ్ కు చేరుకుంటారని తెలిపారు. అధికారులతో కలిసిన అనంతరం రోడ్డు మార్గాన అక్కడి నుండి బయలుదేరి ఉదయం 9:15 గంటలకు ధరూర్ తహసిల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమం ముగిసిన అనంతరం 11:00 గంటలకు బయలుదేరి నాగర్ కర్నూల్ జిల్లాకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.