calender_icon.png 2 November, 2024 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధరణి పోర్టల్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

02-08-2024 01:28:21 PM

ధరణి భూతం రాష్ట్రమంతా విస్తరించింది

ధరణి చట్టం పేరుతో నష్టపోయిన వారందరికీ న్యాయం చేస్తాం

భూసంస్కరణల డ్రాఫ్ట్ చట్టాన్ని వెబ్ సైట్ లో పెడతాం

హైదరాబాద్: గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ లోపభూయిష్టంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ధరణి తెచ్చి సమస్యలకు పేదరైతులు అధికారుల చుట్టూ తిరగారని విమర్శించారు. ధరణి పోర్టల్ పేరుతో అప్పటి పెద్దాయన ప్రజలను దగా చేశారని ఆరోపించారు. ధరణి పోర్టల్ వల్ల ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కున్నారని తెలిపారు. ధరణి పేరుతో కొందరికి భూములు కట్టబెట్టేందుకు కుట్రలు చేశారన్నారు. సాదాబైనామాల పేరుతో ప్రజల నంనచి దరఖాస్తులు స్వీకరించారు. సాదాబైనామాల పేరుతో 9 లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి తెలిపారు. ధరణి పోర్టల్ నిర్వహణను డిఫాల్ట్ అయిన సింగపూర్ కంపెనీకి అప్పగించారని ఆరోపిపంచారు. ధరణి చట్టం అనే భూతం రాష్ట్రమంతా విస్తరించిందన్నారు.

తాము వచ్చాక ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని ప్రజలకు చెప్పిన విషయాన్ని పొంగులేటి గుర్తుచేశారు. ధరణిపై అనేక ఇబ్బందులు పడటం వల్లే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని చెప్పారు. ఇందిర హయాంలో దేశంలోని బడుగువర్గాలకు 40 కోట్ల ఎకరాలు పంచారని వివరించారు. ధరణిపై ఏం చేయాలనే దానిపై కమిటీ వేశామని పొంగులేటి వెల్లడించారు. 18 రాష్ట్రాల్లోని చట్టాలు అధ్యయనం చేశామని చెప్పారు. దేశానికి రోల్ మోడల్ గా ఉండే డ్రాఫ్ట్ చట్టం తయారు చేశామని పేర్కొన్నారు. ధరణి చట్టంతో ప్రజలు అభద్రతాభావంతో ఉన్నారన్నారు. గత ప్రభుత్వం.. పేదల ఆస్తులను లాక్కుని దొరలకు కట్టబెట్టిందని మండిపడ్డారు. ధరణి పేరుతో సామాన్యులకు చెందిన లక్షల ఎకరాలు మాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి చట్టం పేరుతో నష్టపోయిన వారందరికీ న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. భూ సంస్కరణల డ్రాఫ్ట్ చట్టాన్ని మూడు వారాలు వెబ్ సైట్ లో పెడతామన్నారు. డ్రాఫ్ట్ చట్టంపై సూచనలు, సలహాలు స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలకు మంచిచేసే ప్రతి సూచననూ స్వీకరిస్తామని వెల్లడించారు.