calender_icon.png 29 April, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతితో... భూ సమస్యలు పరిష్కారం

23-04-2025 07:22:22 PM

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...

తుంగతుర్తి (విజయక్రాంతి): దొరగారి గొప్పతనం, స్వార్థం కోసం నలుగురు వ్యక్తులు, నాలుగు గోడల మధ్య కూర్చుని నలుగురు వ్యక్తులు చేసిన చట్టం ధరణి. కానీ భూభారతి చట్టం అందరి ఆమోదయోగ్యముతో భూ సమస్యలు పరిష్కరించే విధంగా పొందుపరిచినట్లు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో భూభారతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ... ధరణి అమలు చేసే సమయంలో వంద రోజులు రిజిస్ట్రేషన్లు జరగలేదు.. భూభారతి చట్టం అందరి ఆమోదయోగ్యంతో చేశాం.. భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం.. దొరగారి చెప్పిన పనులు చేయలేదని అర్ధరాత్రి వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేశాడు... గత ప్రభుత్వంలో కబ్జా చేసిన ప్రభుత్వ భూములు, అక్రమ పట్టాలను రద్దు చేస్తాం.. త్వరలో రెవెన్యూ వ్యవస్థలో జీపీఏ వ్యవస్థను తీసుకొస్తున్నాం... భూ భారతిపై రైతులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలి. దీనికోసం ప్రభుత్వ అధికారులతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భూభారతి చట్టంలో తహశీల్దార్ నుంచి సీసీఎల్ఏ స్థాయి వరకు సమస్యలు పరిష్కరించేందుకు వెసులుబాటు ఉన్నట్లు తెలిపారు.

రైతులు అధైర్యపడవద్దు అని సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. భూమి రిజిస్ట్రేషన్ కు ముందు తప్పనిసరిగా భూ సర్వే చేసి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుంది.. భూభారతి పోర్టల్ లో అన్ని సమస్యలకు స్వయంగా దరఖాస్తు చేసుకునేలా రూపొందించారు.. భూభారతితో సమస్యలు పరిష్కారం అయ్యేలా ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకొచ్చింది.. భూభారతితో భూ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవర్, తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న తాసిల్దార్లు ఎంపీడీవోలు వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.