calender_icon.png 15 January, 2025 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై బీఆర్‌ఎస్ రాజకీయం

08-12-2024 04:02:51 PM

ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు దుష్ప్రచారం

రైతులకు మంచి జరిగే సూచన స్వీకరిస్తాం

గత ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని.. చేసి చూపించాం: మంత్రి పొంగులేటి

ఫామ్ హౌస్ లో కూర్చొని కబుర్లు

హైదరాబాద్: గత ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని.. చేసి చూపించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. తెలంగాణ తల్లి విగ్రహంపైనా బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫామ్ హౌస్ లో కూర్చొని కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. మా ప్రభుత్వం వచ్చాక ధరణిలో కొన్ని మార్పులు చేశాం. కమిటీ నివేదిక ఆధారంగా ధరణి ఎలా ప్రక్షాళన చేయాలో చూస్తున్నామన్నారు.ధరణి నిర్వహణను ఈ నెల ఒకటి నుంచి విదేశీ సంస్థ నుంచి ఎన్ ఐసీకి మార్చామని మంత్రి వెల్లడించారు. రైతులకు మంచి జరిగే ప్రతి సూచనను స్వీకరిస్తాం.. తిరస్కరించిన ప్రతి ఫిర్యాదు ఎందుకు చేశారో కారణం ఉంటుందన్నారు.

2020 ఆర్ వోఆర్ చట్టంలో లోపాలు సరిచేసి 2024 ఆర్ వోఆర్ చట్టం తెస్తున్నామని పేర్కొన్నారు. కొత్త చట్టాన్ని రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేస్తామని తెలిపారు. ధరణి కొత్త యాప్, కొత్త చట్టం సామన్య ప్రజలకు చాలా ఉపయోగపడుతోందని వివరించారు. గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రాత్రికి రాత్రే రద్దు చేసిందని మంత్రి పొంగులేటి రెవెన్యూ గ్రామాలకు ఒక అధికారి ఉండాలని స్థానికులు కోరుకుంటున్నారని చెప్పారు. 2004-14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల ఇళ్లు నిర్మించింది. 2014-2023 వరకు కేవలం 1.52 లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లకు టెండర్లు పలిచారని పొంగులేటి తెలిపారు. గత పాలనలో కట్టిన ఇళ్లు గ్రామాల్లో కనబడటంలేదన్న మంత్రి పొంగులేటి తమ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేశామని వెల్లడించారు. గిరిజన నియోజకవర్గాల్లో ఎక్కువ ఇళ్లు కేటాయిస్తున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.