ఖమ్మం: ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రపంచానికి భారత్ రూల్ మోడల్ గా నిలుస్తోందన్నారు. భారత రాజ్యాంగం పెనుముప్పు అంచున ఉందని పొంగులేటి ఆరోపించారు. బిజెపి అబద్ధాలను నిజం చేసేందుకు కాంగ్రెస్ బురదజల్లుతున్నారని మండిపడ్డారు. బిజెపి రాజ్యాంగాన్ని మార్చాలనే సంకల్పంతో ఉందన్నారు. బిజెపికి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటారని ఆరోపించారు. బిజెపి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటారని పొంగులేటి తెలిపారు. బిజెపి మళ్లీ వస్తే భారత్ కు ఇవే చివరి ఎన్నికలు కాబోతున్నాయని పొంగులేటి పేర్కొన్నారు.