calender_icon.png 19 April, 2025 | 4:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల కన్నీళ్లు తుడిచేందుకు 'భూ భారతి': మంత్రి పొంగులేటి

18-04-2025 01:26:32 PM

హైదరాబాద్: ఎన్నికల ముందు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పామని ములుగు జిల్లా వెంకటాపూర్ లో భూభారతి(BHU BHARATHI Portal) రెవెన్యూ సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) గుర్తుచేశారు. భూభారతి సదస్సును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రైతులు, ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తిరిగి తెచ్చుకున్నారని చెప్పారు. పేదల కన్నీటిని తుడిచేందుకు భూ భారతి తీసుకువచ్చామని మంత్రి వెల్లడించారు. గతంలో ధరణి గురించి రెవెన్యూ సదస్సులు ఎక్కడైనా పెట్టారా? అని ప్రశ్నించారు. చేసిన తప్పులను గత పాలకులు ఇప్పటికీ గ్రహించట్లేదని సూచించారు. ధరణి చట్టంలో సాదాబైనామాల అంశాన్ని ఎత్తేశారని ఆరోపించారు. భూ సమస్యలకు సబంధించి9.24 లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి వివరించారు. ప్రజల న్యాయమైన సమస్యలు కచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండాసురేఖ పాల్గొన్నారు.