calender_icon.png 19 April, 2025 | 10:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ భారతి చట్టం దేశంలోనే రోల్ మోడల్

17-04-2025 11:35:13 AM

హైదరాబాద్: నారాయణపేట జిల్లా(Narayanpet District) మద్దూరు మండలంలో భూభారతి ప్రాజెక్ట్ పైలెట్ ప్రాజెక్టను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... ధరణిలో తమ భూమి నమోదు కాలేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ధరణిలో వివరాలు తప్పుగా నమోదయ్యాయని చెబుతున్నారు. ధరణిలో లోపాలను సరిదిద్దాలని మాజీ మంత్రులు కోరుతున్నారు.

భూభారతి బిల్లు(BhuBharati Bill) అసెంబ్లీలో పెడితే ఆమోదం కాకుండా అడ్డుకున్నారని మంత్రి గుర్తుచేశారు. భూ భారతి చట్టం దేశంలోనే రూల్ మాడల్ కాబోతోందని ఆయన స్పష్టం చేశారు. ధరణి అమల్లో ఉన్నప్పుడు అధికారుల వద్దకే ప్రజలు వెళ్లాల్సి వచ్చేది.. భూ భారతి(BHU BHARATHI Portal) అమల్లోకి వచ్చాక అధికారులే ప్రజల వద్దకు వస్తున్నారని పేర్కొన్నారు. ధరణిలో భాగంగా దరఖాస్తు చేసుకోవాలంటే డబ్బులు కట్టాల్సి వచ్చేది.. భూ భారతి అమల్లోకి వచ్చాక ఒక్క రూపాయి లేకుండా దరఖాస్తు చేసే అవకాశముందని చెప్పారు.

పేదలకు చెందిన వేల ఎకరాలను గత ప్రభుత్వం కొల్లగొట్టిందన్న మంత్రి పొంగులేటి(Ponguleti Srinivas Reddy) గతంలో కొల్లగొట్టిన భూములపై ఆడిట్ చేసి పేదలకు పంచుతామని స్పష్టం చేశారు. అసైన్డ్ భూముల్లో(Assigned Lands) సాగు చేసుకుంటున్న అర్హులైన పేదలకు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దొరవారి మాట వీఆర్వో వినలేదని ఆ వ్యవస్థనే కూప్పకూల్చారని మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ అధికారి చెబితే వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను ఒక్క కలం పోటుతో కూల్చారని విమర్శించారు. రెవెన్యూ సమస్యలు రాకుండా అర్హులను తిరిగి వ్యవస్థలోకి తీసుకుంటామని మంత్రి భరోసా కల్పించారు.