15-04-2025 11:43:16 AM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అధ్యక్షతన శంషాబాద్ నోవాటెల్ లో సీఎల్సీ సమావేశం జరుగుతోంది. సీఎల్సీ సమావేశంలో నాలుగు ముఖ్యాంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్ లు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) మీడియాతో మాట్లాడుతూ... భూభారతి చట్టం ఉద్దేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేకు వివరిస్తారని చెప్పారు. 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. పార్టీలు, మతాలు, కులాలకు అతీతంగా ఇళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అర్హులైనా అందిరికీ సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు.
ఎస్సీ వర్గీకరణపై జీవో రూపంలో ఇప్పటికే విడుదల చేశామని చెప్పిన మంత్రి పొంగులేటి కాంగ్రెస్ పార్టీకి, ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇచ్చారని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ ఆరోపణలు చేస్తున్నారు. అధికార దాహంతో ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచే కూల్చే ప్రయత్నం చేస్తున్నారని సూచించారు. భూభారతి వచ్చాక కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy) గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని తెలిపారు. గతంలో అక్రమంగా భూములు కొల్లగొట్టారని ఆరోపించిన మంత్రి పొంగులేటి కొల్లగొట్టిన భూములను భూ భారతి ద్వారా ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందన్నారు. భూములు వెనక్కి తీసుకుంటామని భయాందోళనకు గురవుతున్నారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) సూచన మేరకే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని చెప్పారు. 400 ఎకరాలు వెనక్కి తీసుకురావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. భూ భారతి పేదల ఆస్తులను తిరిగి పేదలకు పంచుతామని చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలని పగటి కలలు కంటున్నారని మంత్రి పొంగులేటి చమత్కరించారు.