calender_icon.png 7 October, 2024 | 2:55 PM

సింగరేణి కార్మికుల విద్య, వైద్యానికి ప్రత్యేక శ్రద్ధ

07-10-2024 12:13:55 PM

హైదరాబాద్: సింగరేణి కార్మికులకు విద్య, వైద్యానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజాభవన్ లో సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... సింగరేణి లాభాల్లో కార్మికులకు బోనస్ అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. గతంలో విస్మరించిన ఒప్పంద కార్మికులకు ఆర్థికసాయం చేస్తున్నామన్నారు. సింగరేణి ఒప్పంద కార్మికులకు రూ. 5 వేలు బోనస్ అందించామని మంత్రి తెలిపారు. కార్మికులకు వైద్యం కోసం గతంలో హైదరాబాద్ తరలించాల్సి వచ్చేదన్న మంత్రి పొంగులేటి సింగరేణి ప్రాంతాల్లోనే కార్మికులకు వైద్య సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. సింగరేణి ప్రాంతాల్లో కార్పొరేట్ ఆస్పత్రులు కట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. హైదరాబాద్ మాదిరిగా సింగరేణి ప్రాంతంలో విద్య భరోసా ఇవ్వాలని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రజాభవన్ లో సింగరేణి కార్మికుల చెక్కుల పంపిణీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.