హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరిగా విదేశీ కుట్ర అంటూ ఫాంహౌస్ లో కూర్చోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. వర్షం పడిన క్షణం నుంచి ప్రజల్లోనే ఉన్నామని, ముందస్తు చర్యల వల్లే ప్రాణనష్టం తగ్గించగలిగామని మంత్రి పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో విపత్తు నిర్వహణ శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ప్రజల రక్షణే మాకు ముఖ్యం అని మంత్రి పొంగలేటి అన్నారు.