హైదరాబాద్,(విజయక్రాంతి): పంటలకు మద్దతు ధర ఇస్తాం, రైతులు అధైర్య పడొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. డిసెంబర్ ఆఖరిలోపు రైతులకు పెండింగ్ లో ఉన్న రూ.13 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు. రైతులు పండించిన చివర గింజ వరకు కొంటామని మంత్రి చెప్పారు. డిసెంబర్ లో గ్రూప్-1 అభ్యర్థులకు నియామకపత్రాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.