calender_icon.png 3 April, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన

21-03-2025 01:22:14 AM

 కల్లూరు, మార్చి 20:- మండలంలోని యర్రబోయిన పల్లి, పెద్ద కోరుకోండి గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు  గురు వారం రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. యర్రబోయిన పల్లి  గ్రామం లో సీసీ రోడ్లు, డ్రైనేజి లకు శంకుస్థాపన చేసిన అనంతరంపెద్దకోరుకోండి గ్రామంలో రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం గ్రామం లో ఎస్సి కమ్యూనిటీ హల్ ప్రారంభించారు.

కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, కల్లూరు ఆర్.డి.వో రాజేందర్, తాసిల్దార్ పులి సాంబశివుడు, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఎస్త్స్ర డి.హరిత, వివిధ ప్రభుత్వం శాఖల అధికారులు,సత్తుపల్లి మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్, కల్లూరు మార్కెట్ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, ఖమ్మం జిల్లా ఆర్యావైశ్య సంఘం అధ్యక్షులు  పసుమర్తి చందర్ రావు,కొండపల్లి శ్రీమన్నారాయణ,లక్కినేని కృష్ణ,ఏనుగు సత్యం బాబు, బాగం ప్రభాకర్ చౌదరి,యాసా శ్రీకాంత్, శివకుమార్ నాయ క్, మట్టా రామకృష్ణ,బొల్లం ఉపేందర్, సాంబ మండలం కాంగ్రెస్ పార్టీ,  యూత్ కాంగ్రెస్ , మహిళా కాంగ్రెస్ నాయకులు, యర్రబోయినపల్లి,పెద్దకోరుకోండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.