భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని జూలూరుపాడు మండలం పడమట నర్సాపురంలోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని మంగళవారం రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని భోజనం, వసతి ప్రాంతాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు రుచికరమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కలెక్టర్ జతేష్ వి పాటిల్, రాహుల్ పాల్గొన్నారు.