సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పాల్వంచలో నూతన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం చేసిన మంత్రి
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పాత్రికేయులు అందరికీ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు, వారి ఇతర సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నూతనంగా నిర్మించిన ప్రెస్ క్లబ్ ను ఆయన స్థానిక ఎమ్మెల్యే సాంబశివరావుతో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలకులు పాత్రికేయుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కేవలం మీడియా సమావేశాల్లోనే పాత్రికేయులకు హామీలు గుప్పించే విస్మరించారని ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన పాత్రికేయులు అందరికీ త్వరలో ఇంటి స్థలాలు మంజూరు చేయటంతో పాటు వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ దాత శ్యామల ఎడ్యుకేషన్ ఫండేషన్ సొసైటీ చైర్మన్ నల్ల సురేష్ రెడ్డి ట్లాడుతూ పాత్రికేయులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ సమ సమాజ స్థాపనకు తోడ్పడాలని సూచించారు.