24-03-2025 07:12:14 PM
హైదరాబాద్ (విజయక్రాంతి): అసెంబ్లీ ఆవరణలో సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్(LRS) కు ఆశించిన స్పందన ఉందన్నారు. ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించాలనే ఆలోచనా ఇప్పటికైతే లేదని, అక్రమ లే అవుట్లు రిజిస్ట్రేషన్ చేసి సబ్ రిజిస్టర్లు(Sub Registers) సస్పెండ్ అవుతున్నారని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో ఎవరు ఇబ్బంది పడకూడదనే ఎల్ఆర్ఎస్ అమలు చేస్తున్నామని, భూముల రిజిస్ట్రేషన్ కు సర్వే మ్యాప్ తప్పనిసరి అని అన్నారు. భూమికి మ్యాప్ లేని వాళ్లకు కూడా సర్వే చేయించి నిర్దారిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.