calender_icon.png 4 April, 2025 | 4:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న మంత్రి పొంగులేటి దంపతులు

03-04-2025 12:54:06 AM

ఖమ్మం, ఏప్రిల్ 2 ( విజయక్రాంతి ):- శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాధురి దంపతులు బుధవారం ఉదయం దర్శించుకున్నారు.

మంత్రి దంపతులకు ఆలయ రాజ గోపురం వద్ద అర్చకులు, ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజ లు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీర్వచన మండపంలో మంత్రి దంపతులకు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు, స్వామివార్ల ఫొటోను అందజేశారు.