calender_icon.png 8 February, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్ ప్రమాద బాధిత కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ..

07-02-2025 11:41:01 PM

మృతురాలు వరమ్మకు నివాళి.. ప్రభుత్వం అండగా ఉంటుంది..

ఖమ్మం (విజయక్రాంతి): బోనకల్లులో ఇటీవల కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో మృతుల కుటుంబ సభ్యులను, తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శుక్రవారం రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించి భరోసా కల్పించారు. ఘటనలో మృతి చెందిన యార్లగడ్డ వరమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించి, సంతాపం తెలిపి, నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం క్షతగాత్రుల కుటుంబ సభ్యులను స్వయంగా కలుసుకుని ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

క్షతగాత్రులు మరీదు పద్మ, మరీదు ధనలక్ష్మీ, మోర్ల శైలజ, మరీదు శైలజ, పసల త్రివేణి, పెదగౌండ్ల వెంకటరమణ తదితరుల ఇళ్లకు వెళ్ళి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ప్రభుత్వపరంగా సహాయ సహకారాన్ని అందిస్తామని బాధిత కుటుంబాలకు మంత్రి హమి ఇచ్చారు. ఈ సందర్బంగా పలువురు జర్నలిస్టులు మంత్రి పొంగులేటిని కలిసి, ఇండ్ల స్ధలాలు గురించి వినతిపత్రం అందజేయగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్, నాయకులు బండి వెంకటేశ్వర్లు, ఉమ్మినేని కృష్ణ, భాగం నాగేశ్వరరావు, సైదానాయక్, మరీదు నాగేశ్వరరావు, తోటకూర వెంకటేశ్వర్లు, యార్లగడ్డ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.