calender_icon.png 24 November, 2024 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసి గిరిజన వంటకాలను ఆస్వాదించిన మంత్రి పొంగిలేటి

23-11-2024 09:36:30 PM

భద్రాచలం: ఆదివాసి గిరిజనుల ఆచార వ్యవహారాలు సాంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోకుండా కాపాడుకోవడమే కాక పాతకాలం నాటి ఆదివాసి వంటకాలు మర్చిపోకుండా నేటికీ ఆచరించడం చాలా సంతోషకరమని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నాడు భద్రాచలం పర్యటనకు వచ్చిన మంత్రి ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన మహిళలు తయారుచేసిన ఆదివాసి వంటకాలను ఆయన తనివితీరా ఆస్వాదించిన అనంతరం మాట్లాడుతూ.. మారుమూల ప్రాంత ఆదివాసి గిరిజన కుటుంబాలు తాతల కాలం నుండి ఎటువంటి కల్తీ లేని సేంద్రియ ఎరువులతో, వర్షాకాలం పంటల పైనే ఆధారపడి ప్రకృతి వ్యవసాయం చేసుకొని, అడవులలో దొరికే వివిధ ఆకుకూరలు దుంపలు ఫలాలు తిని మంచి ఆరోగ్యంగా ఉండి 100 సంవత్సరాలు పైనే జీవించారని ఆయన అన్నారు. పాత తరం వంటకాలు అంతరించిపోకుండా నేటి గిరిజన మహిళలు అటువంటి వంటకాలు తయారు చేయడం చాలా సంతోషకరమని, త్వరలో ఈ ప్రాంతాన్ని పర్యాటక శాఖగా అభివృద్ధి చేస్తున్నందున ఇటువంటి వంటకాలు వచ్చే టూరిస్టులకు అందించాలని కోరారు.