జడ్చర్ల: మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను శుక్రవారం రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పేద విద్యార్థుల చదువు కోసం ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పాఠశాల పనులను త్వరతగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులో తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.