calender_icon.png 14 February, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాంపల్లి కోర్టులో విచారణకు మంత్రి కొండా

14-02-2025 12:35:20 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసు విచారణ సందర్భంగా దేవాదా  శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం నాంపల్లి స్పెషల్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. తన లాయర్ గురుప్రీత్‌సింగ్‌తో కలిసి ఆమె కోర్టుకు వచ్చారు.

కాగా.. హీరో నాగార్జున కుమారుడు నాగచైతన్య, కోడలు సమంత విడాకులపై గతంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో అక్కినేని కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్య  సీరియస్‌గా తీసుకున్న నాగార్జున పరు  కేసు వేసిన విషయం తెలిసిందే.