calender_icon.png 31 January, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీలకు అతీతంగా పని చేస్తున్నాం: మంత్రి కొండా సురేఖ

29-01-2025 05:58:26 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పని చేస్తున్నామని, అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రతీ గ్రామాల్లోని భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు కావాలనే బురద చల్లుతున్నారని మంత్రి మండి పడ్డారు. విలీన గ్రామాలలోని వారికి కూడా ఇందిరమ్మ భరోసా అందజేస్తామన్నారు. అజంజూహి మిల్లు కార్మిక భవనాలు బీఆర్ఎస్ హయంలోనే అమ్మారని, కార్మిక భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయమని అధికారులను ఆదేశించినట్లు ఆమె వెల్లడించారు. ప్రతిపక్ష నేతల డివిజన్లపై ప్రత్యేక్ష దృష్టి పెట్టామని, బీఆర్ఎస్ నాయకుల తీరు మార్చుకోవాలని కొండా సురేఖ హెచ్చరించారు.