calender_icon.png 15 November, 2024 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నంది కంది రామలింగేశ్వర ఆలయంలో పూజలు చేసిన మంత్రి కొండా సురేఖ

15-11-2024 10:02:41 PM

సదాశివపేట,(విజయక్రాంతి): కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ నంది కంది రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం నంది కంది గ్రామంలో ఉన్న పురాతనమైన రామలింగేశ్వర శివాలయంలో కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.. అంతకు ముందు అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికారు.  దర్శనం అనంతరం మంత్రి కొండా సురేఖకు వేదపండితులు వేదాశీర్శచనాలు అందించగా.. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.