calender_icon.png 19 November, 2024 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య శ్రీ సిబ్బందికి మంత్రి కొండా సురేఖ షోకాజ్ నోటీసులు

05-08-2024 11:09:06 AM

వరంగల్: రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాలు, ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. వరంగల్ ప్రాంతీయ కంటి ఆసుపత్రిని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సోమవారం పరిశీలించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలపై కొండా సురేఖ ఆరా తీశారు. సమయపాలన పాటించని వైద్యులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని పలు రికార్డులను ఆమె పరిశీలించారు. ఆరోగ్యశ్రీ సిబ్బందికి మంత్రి షోకాజ్ నోటీసులు అందించారు.