calender_icon.png 12 February, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షాహినాయత్‌గంజ్ ఘటనపై మంత్రి కొండా సురేఖ సీరియస్‌

12-02-2025 05:54:11 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): షాహినాయత్‌గంజ్‌లోని ప్రార్థనా స్థలంపై మంగళవారం రాత్రి మాంసం ముక్కలు విసిరిన ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి, పరిశీలించారు. వివరణాత్మక నివేదికను త్వరగా సమర్పించాలని శాఖ సీనియర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు కొండా సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర దర్యాప్తు తర్వాత ఈ సంఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించడానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. తమ తప్పులతో ప్రజల మనోభావాలను దెబ్బతీసే వారిపై రాష్ట్ర ప్రభుత్వం రాజీపడదన్నారు. పోలీసు శాఖ వారిపై కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.