calender_icon.png 29 November, 2024 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాల్లో కుట్రల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ హస్తం

29-11-2024 04:51:15 PM

హైదరాబాద్: తెలంగాణ  అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కోండా సురేఖ బీఆర్ఎస్ నేత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురుకులాల్లో కుట్రల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తముందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఆర్ఎస్ ప్రవీణ్ గతంలో గురుకులాల కార్యదర్శిగా ఉన్నార, ప్రవీణ్ హయాంలో అనుమతి లేకుండా సిబ్బందిని నియమించారని సురేఖ వెల్లడించారు. ప్రవీణ్ తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారు. ప్రవీణ్ తన ఆదేశాలతో తన అనుచరుల ద్వారా గురుకులాల్లో కుట్రలు చేస్తున్నారని సురేఖ పేర్కొన్నారు.