calender_icon.png 2 October, 2024 | 5:28 PM

నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణం

02-10-2024 03:41:33 PM

ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి 

ఇండస్ట్రీలో హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేశారు

ఆయన తీరుతో చాలామంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నారు 

మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు 

కార్వాన్, (విజయక్రాంతి): మంత్రి కొండా సురేఖ లంగర్ హౌస్ బాపు ఘాట్ లో బుధవారం నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.  కేటీఆర్ సూచనతోనే తనపై స్క్రోలింగ్ చేశారని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాగచైతన్య, సమంత దంపతులు విడిపోవడానికి కేటీఆరే కారణమని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ తీరు, వ్యవహారంతో సినిమా ఇండస్ట్రీలోని చాలామంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు. బిఆర్ఎస్ నేతలు తనపై ఉద్దేశపూర్వకంగానే ట్రోల్ చేశారాని ధ్వజమెత్తారు.

ఈ విషయంలో కేటీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంచి మనసుతో మాజీ మంత్రి హరీష్ రావు అదేవిధంగా ఎంపీ రఘునందన్ రావు  రోలింగ్ విషయంలో స్పందించడం హర్షనీయమని అన్నారు. తాను ఐదేళ్లు బిఆర్ఎస్ లో పని చేశానని తన వ్యక్తిత్వం ఏందో అందరికీ తెలుసు అన్నారు. ఇక్కడి నుంచి 3, దుబాయ్ కి చెందిన 2 సోషల్ మీడియా ఖాతాల ద్వారా తనపై దుష్ప్రచారం చేశారని దీనిపై ఫిర్యాదు చేసినట్లు కొండా సురేఖ పేర్కొన్నారు. రాజకీయాల్లో పూర్తిగా విలువలు దిగజారిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది హీరోయిన్లకు కేటీఆర్ మత్తుపదార్థాలు అలవాటు చేశారని తెలిపారు. వాళ్లతో కలిసి రేవు పార్టీలు చేసుకుని వాళ్లను బ్లాక్ మెయిల్ చేశారని మండిపడ్డారు.