03-04-2025 12:00:00 AM
హనుమకొండ, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి): హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పై పోలీసులు జరిపిన లాటి చార్జీలు నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు బుధ వారం హనుమకొండ రాంనగర్ లో గల మంత్రి కొండ సురేఖ ఇల్లు ముట్టడించారు. పోలీసు వలయాన్ని ఛేదించుకొని విద్యార్థులు ఇంటి గేటు ముందు కూర్చొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
పోలీసులకు విద్యార్థి సంఘ నాయకులకు తీవ్ర వాగ్వాదం తోపు లాట జరిగింది. విద్యార్థులను పోలీసులు బలవంతంగా వ్యాన్లలో ఎక్కించి సుబేదారి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈసందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడు తూ ప్రభుత్వం హెచ్.సి.యు. విద్యార్థుల పట్ల కర్కశంగా, అత్యంత పాశవీకంగా వ్యవహ రిస్తూ, అక్రమ లాఠీ చార్జీలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లాఠీఛార్జికి పాల్ప డిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయా లన్నారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయ కులు మొగిలి వెంకట్ రెడ్డి ,భాషబోయిన సంతోష్, బి.నరసింహరావు, కే.శ్రావణ్, మాలోత్ రాజేష్, మర్రి మహేష్, మంద నరేష్, ఎల్తూరి సాయికుమార్, కుమ్మరి శ్రీనాథ్, శివ నాస్తిక్, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘల నాయకులు బి నరసింహారావు, మొగిలి వెంకట్ రెడ్డి ,భాష బోయిన సంతోష్, మాలో రాజేష్, కే.శ్రావణ్, మర్రి మహేష్,కె. శ్రీనాథ్, ఇ.సాయి, వంశీ, శివ, సి.హెచ్. వినయ్ లను సుబేదారి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు.