calender_icon.png 30 November, 2024 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుటుంబ సర్వేలో మంత్రి కొండా సురేఖ.. వివరాలు నమోదు

30-11-2024 01:09:35 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ కుటుంబ సభ్యుల వివరాలను ఎన్యూమరేటర్లు శనివారం నమోదు చేశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో  వివరాలు  నమోదు చేయించుకున్నారు. జీహెచ్ఎంసి డిప్యూటి కమిషనర్ రజనీకాంత్ రెడ్డి, సూపర్వైజర్ గంగాధర్, ఎన్యుమరేటర్ రమేష్ ఈ సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ సర్వే పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం మేరకు వీలైనంత త్వరగా కుల సర్వే పూర్తి చేసేలా కార్యాచరణను అమలు చేయాలని అధికారులకు సూచించారు.  ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రజలంతా తప్పనిసరిగా సర్వేలో వివరాలు నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలని వారిని ఆదేశించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా చేపట్టిన ఈ మహా యజ్ఞం విజయవంతమయ్యేలా  సహకరించాలని మంత్రి కొండా సురేఖ ప్రజలకు పిలుపునిచ్చారు.