హైదరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మానవత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం వరంగల్ నుంచి పెద్దపల్లి వెళ్తున్న మంత్రి కొండా సురేఖకు సుల్తానాబాద్ మార్కెట్ చౌరస్తా వద్ద రోడ్డుపై చెప్పులు లేకుండా వెళ్తున్న బిహార్ పాపను చూసి చలించి పోయారు. వెంటనే తన కాన్వాయ్ ని ఆపి, చిన్నారి తండ్రితో మాట్లాడి సిబ్బందితో పక్కనే చెప్పుల దుకాణంలో చంటి పాపకు చెప్పులు కొనిపించారు. ఆ పసి పాపకు బట్టలు కూడా కొనిచ్చి మంత్రి సురేఖ మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం పాప తండ్రిని వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.