నిజామాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా పర్యటనకు నేడు మంత్రి కొమటిరెడ్డి వెంకట్రెడ్డి పర్యవేక్షించనున్నారు. శుక్రవారం నిజామాబాద్ అర్భన్, ఇందల్వాయి, దర్పల్లి మండలాల్లో వివిధ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు, ఇతర అభివృద్ది కార్యక్రమాలపై కలెక్టర్, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.