calender_icon.png 3 March, 2025 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోనియా గాంధీ లేకుంటే వచ్చే జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదు

09-12-2024 01:03:23 PM

హైదరాబాద్: సోనియా గాంధీ లేకుంటే వచ్చే జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదు.. ఈ విషయాన్ని సభలో ప్రతిపక్ష నేత కేసీఆర్ స్వయంగా ప్రకటించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ ప్రకటన రోజు.. నాలుగు కోట్ల ప్రజల కోరిక తీరిన రోజు అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజున ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. గత పదేళ్లలో నీళ్లు, నిదులు, నియామకాలు ఏమీ రాలేదని ఆయన సభలో ఆరోపించారు. మేధావులతో చర్చించాక తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన చేశారు. గ్రామీణ పరిస్థితులు ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన చేశామని చెప్పారు.