calender_icon.png 2 April, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

31-03-2025 12:34:23 PM

హైదరాబాద్: నల్గొండలో జరిగిన ఈద్-ఉల్-ఫితర్(Eid-ul-Fitr celebrations) వేడుకల సందర్భంగా నెల రోజుల పాటు జరిగిన రంజాన్ ఉపవాసం, ప్రార్థనల ముగింపు సందర్భంగా జరిగిన ఉత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మంత్రి అల్లాహ్‌కు ప్రార్థనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ముస్లిం మైనారిటీ సమాజానికి ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శరత్ చంద్ర పవన్ కూడా పాల్గొన్నారు. నల్లగొండ పట్టణంలో రంజాన్ మాసపు ఉపవాస దీక్షలు, ప్రార్థనలకు చివరి అంకమైన 'ఈద్-ఉల్-ఫితర్' రోజున ముస్లిం సోదర, సోదరీమణులందరితో కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొనడం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి ఎక్స్ లో పేర్కొన్నారు.