20-02-2025 01:50:54 PM
కేసీఆర్ నుంచి ప్రాణభయం ఉంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలి.
న్యాయపరంగా కొట్లాడాలి కానీ.. చంపేస్తారా?.
కేసీఆర్, ఆయన కుటుంబం తెలంగాణను దోచుకుంది.
కోట్లు పోతే సంపాదించుకోవచ్చు.. ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా?.
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)పై న్యాయపోరాటం చేస్తున్న చక్రధర్ గౌడ్ కు రక్షణ కల్పిస్తామని గాంధీభవన్ లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబం అక్రమాలను బయటపెడితే చంపేస్తారా? అని ప్రశ్నించారు. రాజలింగమూర్తి(Rajalinga Murthy) హత్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తామని మంత్రి కోమటి రెడ్డి తెలిపారు. న్యాయపరంగా కొట్లాడాలి కానీ.. చంపేస్తారా? ప్రశ్నించారు. కేసీఆర్(KCR), ఆయన కుటుంబం తెలంగాణను దోచుకుందన్నారు. రూ. కోట్లు పోతే సంపాదించుకోవచ్చు.. ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? అని ప్రశ్నించారు. కేసీఆర్ నుంచి ప్రాణభయం ఉన్న వారు ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. రాజలింగమూర్తిని క్రూరంగా చంపేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు దోపిడీ(Kaleshwaram project exploitation)పై రాజలింగమూర్తి పోరాడారని మంత్రి గుర్తుచేశారు.
అవినీతికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసిన నాగవెల్లి రాజలింగ మూర్తి హత్యకు సంబంధించి ఐదుగురు వ్యక్తులపై భూపాలపల్లి పోలీసులు(Bhupalpally Police) ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న నిందితులు రెంకుంట్ల సంజీవ్, పింగిలి శ్రీమంత్, మోర్ కుమార్, కొత్తూరి కుమార్, రేణుకుంట్ల కొమురయ్య. బుధవారం సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో రెడ్డి కాలనీలో బైక్‌పై వెళుతుండగా మూర్తి (53) పై దాడి జరిగింది. కత్తులతో సాయుధులైన దుండగులు మూర్తిని తీవ్రంగా గాయపరిచారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించారు కానీ అక్కడికి చేరుకునేలోపే ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు. రాజలింగ మూర్తి అవినీతికి వ్యతిరేకంగా చేసిన పోరాటానికి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు(Former minister Harish Rao)లకు వ్యతిరేకంగా న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొన్నందుకు అందరి దృష్టిని ఆకర్షించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం(Kaleshwaram Lift Irrigation Scheme)లో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.