calender_icon.png 1 January, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మామ, బామ్మర్దిని ఇరికించేందుకే హరీష్ సిట్ కోరారు

29-12-2024 05:29:01 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓఆర్ఆర్ (ORR) టోల్ లీజ్ పై సిట్ వేయాలని హరీష్ రావు కోరిన విషయాన్ని మంత్రి గుర్తుచేస్తూ మామ, బామ్మర్దిని ఇరికించేందుకే హరీష్ సిట్ కోరారని తెలిపారు. హరీష్ రావు అసెంబ్లీలో కోరడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సిట్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ టోల్ లీజుపై విచారణ జరుగుతోందన్న కోమటిరెడ్డి ఫార్ములా- ఈ కార్ రేసులో దోంగలు దొరికారని చెప్పారు.

త్వరలోనే ఓఆర్ఆర్ టోల్ లీజ్ లో అవకతవకలు కూడా బయటపడతాయని వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ కోసం ఢీల్లీలో ఉండి ఎంతో కృషి చేశానన్నారు. 2017లో ఆగిపోయిన ప్రాజెక్టు తమ కృషి వల్ల ముందడుగు పడిందన్నారు. ఆర్ఆర్ఆర్ మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ కు సహకరించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nithin Gadkari)కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ఫోన్ చేసి ఆర్ఆర్ఆర్ పై అభినందనలు తెలిపారు.