calender_icon.png 28 March, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీశ్ రావుకు తెలియదు.. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి..

21-03-2025 12:13:14 PM

హరీశ్ రావు వెనక నడిపించేంది ఇద్దరు, ముగ్గురున్నారు

భూముల గురించి హరీశ్ రావు మాట్లాడడం హ్యాస్యాస్పదం

కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి

హరీశ్ రావును ముందుపెట్టి మాట్లాడిస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) అన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి ఔటర్ రింగ్ రోడ్డును రూ. 7300 కోట్లకు అమ్మారని కోమటిరెడ్డి ఆరోపించారు. గతంలో మద్యం దుకాణాల గడువుకు 3 నెలల ముందే దరఖాస్తులు తీసుకున్నారని చెప్పిన మంత్రి కోమటిరెడ్డి నిరుద్యోగుల వద్ద నాన్ రిఫండబుల్ ఫండ్ కింద రూ. 2 వేల కోట్లు వసూలు చేశారని తెలిపారు. కోకాపేటలో భూముల వేలం వేసి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది.. భూముల గురించి హరీశ్ రావు(Harish Rao) మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు. హరీశ్ రావును ముందుపెట్టి మాట్లాడిస్తున్నారన్న కోమటిరెడ్డి హరీశ్ రావు వెనక నడిపించేది ఇద్దరు, ముగ్గురున్నారని చమత్కరించారు. హరీశ్ రావుకు మొత్తం తెలియదు.. మీ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు.