calender_icon.png 26 April, 2025 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం కథ త్వరలోనే అందరికీ తెలుస్తది

26-04-2025 01:17:18 PM

కాళేశ్వరం కథ త్వరలేనే

తెలివి ఉన్న ఎవరైనా కాళేశ్వరం చేపడతారా?

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన ప్రాజెక్టులపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కథ త్వరలోనే అందరికీ తెలుస్తోందని చెప్పారు. రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం చేపట్టి మోసం చేశారని మంత్రి ఆరోపించారు. తెలివి ఉన్న ఎవరైనా కాళేశ్వరం(Kaleshwaram project) చేపడతారా? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగిపోవటం చిన్న విషయం అన్నట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మేడిగడ్డ, సుందిళ్ల పనికిరావని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందని వివరించారు.

మేడిగడ్డ, సుందిళ్లలో నీళ్లు నిలిపితే ఈపాటికే మొత్తం కొట్టుకుపోయేదని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణానికి తుమ్మడిహట్టి సరైన ప్రాంతమని ఇంజినీర్లు చెప్పారని పేర్కొన్నారు. తుమ్మడిహట్టి పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని పక్కన పెట్టారని తెలిపారు. ఎస్ఎల్బీసీకి కాళేశ్వరానికి పోలికేంటి... కాళేశ్వరం అంశాన్ని డైవర్ట్‌ చేయాలని కేటీఆర్‌(Kalvakuntla Taraka Rama Rao) ప్లాన్‌ చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి సూచించారు. కాళేశ్వరం నాణ్యత లోపానికి కారణమైన వాళ్లపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.