హైదరాబాద్: నిరుపేద అర్కిటెక్ట్ విద్యార్ధిని ప్రణవి చొల్లేటి ఇటలీ విద్యకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) అండగా నిలిచారు. ఇటలీలోని ప్రఖ్యాత విద్యాసంస్థ పాలిటెన్సికో డి టోరినో (పాలిటో) లో అర్కిటెక్చర్ కన్ స్ట్రక్షన్ లో మాస్టర్స్ లో సీటోచ్చింది. కానీ, ఆర్ధికంగా మా కుటుంబం అంత భరించేస్థితిలో లేదు. సార్ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రణవి చొల్లేటి అనే విద్యార్ధిని విన్నవించింది. విషయం తెలుసుకున్న మంత్రి.. ఆదివారం ఉదయం ఇంటికి పిలిపించుకొని లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. అందించడమే కాదు, నీ చదువుకు అండగా ఉంటా అంటూ భరోసా ఇచ్చారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్ధి చదువు(Education) ఆగిపోతే.. వారి జీవితం ఆగిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదనవ్యక్తం చేశారు.
ప్రతిభ కలిగిన ఏ విద్యార్ధి చదువు ఆగిపోకుడదని తెలిపిన ఆయన.. జీవితాలను మార్చే ఆయుధం చదువు ఒక్కటేనని అయన అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహాయంపై ప్రణవి ఆనందం వ్యక్తం చేశారు. తన పరిస్థితి ఇలా ఉందని తెలియగానే.. స్పందించి నువ్వెం భయపడకు ప్రణవి, నేనున్నా అని మంత్రి భరోసా ఇచ్చారని.. ఈ రోజు ప్రతీక్ ఫౌండేషన్(Prateek Foundation) ద్వారా లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించారని తెలిపింది. ఆయన అందించిన తోడ్పాటుతో ఉన్నత చదువులు పూర్తి చేసి జీవితంలో స్థిరపడి తనలాంటి వాళ్లకు తోడుగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) ఇప్పటికే ప్రతిభ కలిగి, ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఎందరో విద్యార్ధులకు సహాయ సహాకారాలు అందిస్తున్నారని వారి మంచి మనసుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రణవి తెలిపారు.