22-03-2025 11:48:18 AM
హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రహదారులు వేస్తాం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) శనివారం ప్రారంభమై కొనసాగుతున్నాయి. శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) మాట్లాడుతూ.. రాష్ట్రంలో పీపీపీ విధానంలో రహదారులు వేయట్లేదని, హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రహదారులు వేస్తామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. పీపీపీ విధానం వేరు.. హైబ్రిడ్ యాన్యుటీ విధానం వేరని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 29 వేల కి.మీ మేరు రహదారులున్నాయని చెప్పారు. మన రహదారులే మన సంపద పెంచుతాయని ఆయన స్పష్టం చేశారు.
గత పదేళ్లలో రూడ్లపై రూ. 3945 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి కోమటిరెడ్డి సూచించారు. గతంలో రోడ్ల కోసం తెచ్చిన రుణాల బకాయిలు చెల్లిస్తున్నామని వెల్లడించారు. హరీష్ రావు చాలా మేధావి అన్న మంత్రి కోమటిరెడ్డి ఆయనకున్నంత తెలివి మాకు లేదన్నారు. పదేళ్లలో రూ. 3 వేల కోట్లు పనులు చేస్తే.. 14 నెలల్లో రూ. 4 వేల కోట్ల పనులు జరుగుతున్నాయని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్ అండ్ బీ రోడ్ల పురోగతి మందగించిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గతంలో మొదలు పెట్టిన పనులు కూడా ఆగిపోయాయన్నారు. బిల్లులు రాక ఇబ్బందిగా ఉన్నట్లు గుత్తేదారులు చెబుతున్నారని వెల్లడించారు. కొత్త రహదారులు ఏమైనా మంజూరు చేసినట్లు కూడా లేదని వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.