calender_icon.png 28 November, 2024 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్, హరీష్ రావులది నా స్థాయి కాదు

28-11-2024 04:22:50 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులది తన స్థాయి కాదని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. వాళ్లు కేసీఆర్ కొడుకు, అల్లుడు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు ఎవరో చెప్తే ఆయనకు సమాధానం చెప్తానన్నారు. తాను రైతు కుటుంబం నుండి వచ్చి, కింది స్థాయి నుండి నాయకుడిని అయ్యానని వెల్లడించారు. 7లక్షల కోట్లు అప్పు చేసి ఫార్మ్ హౌస్ లో పడుకున్న ఆయన వస్తే.. గురుకులాలకు వస్తా అంటే పోదామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.