calender_icon.png 20 January, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిసిసి ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ సతీమణి మృతి పట్ల మంత్రి కోమటిరెడ్డి నివాళి

19-01-2025 10:26:31 PM

యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ సతీమణి రోజా అనారోగ్యంతో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం 6 గంటలకు మృతి చెందారు. ఆదివారం నాడు భువనగిరి పట్టణంలోని మీనా నగర్ లో  ప్రమోద్ కుమార్ సగృహంలో ఆమె భౌతిక దేహానికి తెలంగాణ రాష్ర్ట మంత్రివర్యులు  కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుష్ప మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రమోద్ కుమార్ ను ఓదార్చి ఎలా జరిగింది అని అడిగి తెలుసుకుని కన్నీరు పెట్టారు. పిల్లల వివాహాలు కూడా చేయకుండానే అనారోగ్యంతో చనిపోవడం బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ కమిషన్ మెంబర్లు రాపోలు జయప్రకాష్, బాల లక్ష్మీ , ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరికరి  ప్రీతం. మాజీ ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి  భువనగిరి పార్లమెంట్ బి ఆర్ ఎస్ పార్టీ కన్వీనర్ క్యామ మల్లేష్, బోనగిరి మాజీ శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, ఆలేరు మాజీ శాసనసభ్యులు బూడిద బిక్షమయ్య గౌడ్, టిఆర్‌ఎస్ పార్టీ రాష్ర్ట నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి ఆలేరు మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్, పట్టణ పుర ప్రముఖులు పోతనక్ రోజా భౌతిక దేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. మీనా నగర్ లోని ఏఎన్‌ఆర్ కాలనీ నుండి సాగిన అంతిమయాత్ర హైదరాబాద్ రోడ్డు మీదుగా హైదరాబాద్ చౌరస్తా హౌసింగ్ బోర్డ్ సింగన్నగూడెం చౌరస్తా నుండి స్మశాన వాటిక లో దాన సంస్కరణలు ఈ అంతిమయాత్రలో భువనగిరి నియోజకవర్గం వ్యాప్తంగా త్వరలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.