10-02-2025 03:45:41 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) పాల్గొని సోమవారం బ్రహ్మ ముహూర్తంలో షాహీ పుణ్యస్నానం ఆచరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజా ప్రభుత్వానికి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తున్నానట్లు ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల ఆనందం, శ్రేయస్సు కోసం పేదలకు సేవ చేయడానికి ప్రజా ప్రభుత్వానికి మరింత బలం చేకుర్చాలని గంగమ్మను ప్రార్థించానని వెంకట్ రెడ్డి ఎక్స్ లో తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లోని సంగం సందర్శన వీడియోను ఆయన పోస్ట్ చేశారు. పాల్గొన్న కోట్లాది మంది యాత్రికుల మాదిరిగానే ఆయన కూడా భక్తితో నింపిన లోతైన ఆధ్యాత్మిక అనుభవం అన్నారు. డిసెంబర్ 6, 2024న, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మహా కుంభమేళాకు హాజరు కావాలని ఆహ్వానించినట్లు గుర్తు చేశారు.