calender_icon.png 31 January, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈసారైనా అసెంబ్లీకి వస్తారా..? లేదా..?: మంత్రి కోమటిరెడ్డి

29-01-2025 12:42:05 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహంచారు. ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి మాట్లాడుతూ... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై ఫార్ములా ఈ కార్ రేసింగ్, ధరణి వంటి పలు కేసులున్నాయని ఆరోపించారు. తనపై ఒక్క కేసైన ఉందా..? అని ప్రశ్నించారు. మూడేళ్లు పదవి వదులుకున్నా, ప్రతిపక్ష నేత 11 నెలలుగా అసెంబ్లీకి రావట్లేదని మండిపడ్డారు. సొరంగ మార్గాన్ని కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదు..?, ఈసారైనా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా..? లేదా..? అని అడిగారు. గతంలో పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి మూసీ ప్రక్షాళన చేయలేదు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆగ్రహించారు. యమున కంటే మూసీ మరింత ప్రమాదకరంగా మారిందని, బీఆర్ఎస్ నేతలకు మూసీ నదిపై అవగాహన లేదని విమర్శించారు. నీతి నిజాయితీకి తను మారుపేరు అని చెప్పారు. ఇక నిన్న కేటీఆర్ నల్గొండ రైతు మహధర్నాలో పాల్గొన్న విషయం తేలిసిందే.

పదేళ్లు నల్గొండ జిల్లాను పట్టించుకోని కేటీఆర్ ఇప్పుడేందుకొచ్చారు..?, ఎస్ఎల్బీసీని ఎందుకు పూర్తి చేయలేదు..?, మల్లన్న సాగర్ నుంచి ఆలేరుకి ఎందుకు నీళ్ళు ఇవ్వలేదో సమాదానం చప్పాలని  అని ప్రశ్నించారు. మహాత్మాగాంధీ యూనివర్శిటీకి ఎప్పుడైనా వెళ్లాడా..? అని అడిగారు. టీ హబ్ కు తాళం వేసి, బార్ లాగా తయారు చేశారని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. తాను నల్గొండలో ఫ్లోరోసిస్ కోసం పోరాటం చేసినప్పుడు కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారన్నారు. కేటీఆర్, హరీశ్ రావులు కేసీఆర్ పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ తను కష్టపడి వచ్చినన్ని, వారి తండ్రి వ్యవసాయం చేశారని గుర్తు చేశారు. కేటీఆర్, హరీశ్ రావులు తన కాలి గోటికి కూడా సరిపోరని కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు.  తెలంగాణ ఉద్యమంలో గద్దర్‌ ఉన్నాడా..? బండి సంజయ్‌ ఉన్నాడా..? అని ఆయన ప్రశ్నించారు. గద్దర్ ఊరూరు తిరిగి పాటలు పాడి ప్రజలను చైతన్యపరిచారని, ఆయన చనిపోతే ప్రధాని మోడీ కూడా నివాళులర్పించారని గుర్తు చేశారు. కేంద్రమంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్‌ ఈలాంటి వ్యాఖ్యలు చేయకూడదని  మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.