హైదరాబాద్: రైతు భరోసాపై విపక్షాల విమర్శలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkat Reddy) కౌంటర్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ టెండర్లు పలిచింది 7 వేల కోట్లకు అయితే 12 వేల కోట్ల అవినీతి అంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR), హరీశ్ రావు మానసిక పరిస్థితి సరిగాలేదన్న మంత్రి డాక్టర్లకు చూపించుకోవాలన్నారు. అధికారం ఇక రాదని వారికి అర్థమైందన్నారు. మూసీ టెండర్లు కాకముందు లక్షన్నర కోట్లన్నారు. పిచ్చివాళ్లు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తామన్నారు. కేసీఆర్(KCR) అసెంబ్లీకి రావాలి.. తప్పులకు సమాధానం చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.