హైదరాబాద్: బీఆర్ఎస్ హయాంలో ఎక్కవలో ఎక్కువ 14 గంటలే కరెంట్ వచ్చేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఒక సబ్ స్టేషన్ లో లాగ్ బుక్ పరిశీలిస్తే తెలిసిందని విమర్శించారు. ఆ 14 గంటల్లోనూ ఐదుసార్లు కోతలుండేవని విద్యుత్ సిబ్బంది చెప్పేవారని మంత్రి వెల్లడించారు. బీఆర్ఎస్ 24 గంటలు విద్యుత్ సరఫరా చేయలేదు.. ఆధారలు పంపిస్తామని కోమటి రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో కొత్తగా ఒక ఎకరా సాగులోకి వచ్చినట్లైతే తాను రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి తెలిపారు. ఉచిత విద్యుత్ అందించిందే కాంగ్రె.. దాని పేటెంట్ హక్కూ కాంగ్రెస్ దేనని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో నీళ్లు ఇవ్వలేదు.. విద్యుత్ ఇవ్వలేదు. ఏమీ ఇవ్వలేదని కోమటి రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో కూలిపోయే ప్రాజెక్టులు కట్టారని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ ద్వారా నల్లా నీళ్లు వచ్చాయని ప్రజలు చెబితే.. మరోసారి ఓట్లు అడగం అన్నారన్న మంత్రి కోమటి రెడ్డి మిషన్ భగీరథ రూ. 50 వేల కోట్లు తినేశారని సంచలన ఆరోపణ చేశారు.