నవాబ్ పేట: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సోమవారం పర్యటించారు. నవాబ్ పేట మండల కేంద్రంలోని బిటి డబుల్ రోడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని కోమటి రెడ్డి చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా నవాబ్ పేట నుంచి తిరుమలాపూర్ వరకు బిటి డబుల్ రోడ్డు పనులకు మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, మహబూబ్ నగర్ ఎంపి డికె అరుణ, జడ్చర్ల శాసన సభ్యులు అనిరుధ్ రెడ్డి, దేవరకద్ర శాసన సభ్యులు జి. మధు సూదన్ రెడ్డి పాల్గొన్నారు.