calender_icon.png 17 November, 2024 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి

04-08-2024 06:41:26 PM

హైదరాబాద్: ఉప్పల్ లో ఎలివేటెడ్ కారిడార్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిశీలించారు. ఉప్పల్-నారపల్లి మధ్య పైవంతెన నిర్మాణ పనులపై మంత్రి ఆరా తీశారు. 2018 జూన్ లో  ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభం కాగా, 24 నెలల్లోనే పూర్తి చేయాలని ఒప్పందంలో ఉంది. కానీ వివిధ కారుణాలు చూపుతూ గత కొన్నాళ్లుగా పనులు నిలిచిపోయ్యాయి. దాంతో రూ.626.76 కోట్లతో చేపట్టిన 6.25 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ పనులు ఆగిపోవడంతో ఉప్పల్ జంక్షన్ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నిర్మాణ పనులను కొన్నాళ్లుగా అర్థంతరంగా ఆపేయడంతో గుంతల రోడ్డుపై ఇబ్బందులు పడుతున్నామని వాహనాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఇతర అధికారులతో మంత్రి కోమటిరెడ్డి చర్చించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పై చర్చించారు.