న్యూఢిల్లీ,(విజయక్రాంతి): దేశంలోనే తొలి మహిళా బస్ డిపోను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కైలాశ్ గహ్లోత్ ఢిల్లీలో శనివారం ప్రారభించారు. ఢిల్లీలోని సరోజిని నగర్ లో పూర్తిస్థాయి మహిళా సిబ్బందితో కూడిన డిపోను ప్రారంభించి 'సఖి డిపో' అని పేరు పెట్టారు. ఈ డిపోలో మేనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా సిబ్బంది అంతా మహిళాలే ఉంటారని, సఖి బస్ డిపో కోసం మొత్తం 225 మంది సిబ్బందిని కేటాయించామని కైలాశ్ గహ్లోత్ వెల్లడించారు.
కాగా దేశంలో తొలి మహిళా బస్ డిపోను ప్రారంభించడం ఆనందంగా ఉందని, ప్రస్తుతం రవాణా రంగంలో పని చేస్తున్న మహిళ ఉద్యోగులు తమకు సరైన సౌకర్యాలు లెవని మంత్రి ముందు నిరసన తెలిపారు. ఫిక్స్డ్ జీతం, పర్మినెంట్ చేసేల హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో మహిళ ఉద్యోగులతో మాట్లాడిన మంత్రి కైలాశ్ గహ్లోత్ వారి డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.