calender_icon.png 15 November, 2024 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుబంధు పేరిట ప్రభుత్వాస్తులను అమ్మేశారు

14-11-2024 04:32:20 PM

నిజామాబాద్,(విజయక్రాంతి): గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరిట ప్రభుత్వ భూములను అమ్మి వేసిందని రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మార్కెట్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం మంత్రి జూపల్లి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చేయోద్దనే ఉద్దేశంతోనే కొంత ఆలస్యమైన ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేస్తుందన్నారు. గత ప్రభుత్వం తక్కువ ధరకే ప్రభుత్వ భూములను విక్రయించింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. ఏడాదికి 1000 కోట్లు ఆదాయం వచ్చే రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్టర్ ను కేవలం 7000 కోట్లకి గత టిఆర్ఎస్ ప్రభుత్వం విక్రయించిందని తెలిపారు.

ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు. రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధరను పొందాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కల్పించవద్దని ఆదేశించారు. ఆయనతోపాటు నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే  పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి సునీల్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.